📚 Perfect Plan – Guaranteed Marks! ✨

📚 ప్లాన్ బాగుంటే – మార్కులు పక్కా! ✨

🔥 పరీక్షల సీజన్ మొదలైంది… ఇంటర్, ఇంజినీరింగ్, JEE, NEET, EAMCET, AISSEE, NAVODAYA< RMS అన్నీ దగ్గరలోనే.
👨‍🎓 ఒకరు వినయ్ – ఎప్పుడూ చదువుతూనే ఉంటాడు.
👨‍🎓 మరొకరు విజయ్ – ఆటపాట, విశ్రాంతి, చదువు అన్నింటికీ సమయాన్ని పంచుకుంటాడు.

👉 ఎవరు గెలుస్తారు? చాలాసార్లు విజయ్ గెలుస్తాడు. ఎందుకంటే అతను ప్లాన్‌తో చదువుతాడు! 📝


💡 ఎందుకు ప్లాన్ ముఖ్యం?
✔️ "If you fail to plan, you are planning to fail" అనే నానుడి నిజం.
✔️ పథకం ఉంటే ఒత్తిడి తగ్గుతుంది 😌, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది 💪.
✔️ ప్లాన్ లేకుండా చదవడం = తుది నిమిషం ఒత్తిడి + గందరగోళం. 😓


📌 మంచి ప్లాన్ ఎలా ఉండాలి?
1️⃣ లక్ష్యం స్పష్టంగా పెట్టుకోండి 🎯 – 80% వస్తే సరిపోతుందా? లేక 95%కోసం కష్టపడాలా?
2️⃣ బలాలు – బలహీనతలు తెలుసుకోండి ⚖️ – ఏ సబ్జెక్ట్‌లో బలం ఉందో, ఏది వీక్ అనేది గుర్తించండి.
3️⃣ నెలవారీ పథకం 📅 – కొత్త పాఠాలు + పునశ్చరణ సమపాళ్లలో.

  • నెలలో 3 వారాలు కొత్త పాఠాలు, చివరి వారం రివిజన్.

  • వారంలో 5 రోజులు కొత్త పాఠాలు, 2 రోజులు రివిజన్.

  • రోజులో ఉదయం/రాత్రి చివరి గంట రివిజన్‌కు.
    4️⃣ రోజువారీ సమయ పట్టిక ⏳ – చదువు, రివిజన్, రాయడం, రిలాక్సేషన్ అన్నీ సమపాళ్లలో ఉండాలి.
    5️⃣ ఖాళీ సమయం ఉంచుకోండి 🕊️ – అనుకోని అవాంతరాలకు “buffer time” ఉండాలి.
    6️⃣ ప్రతి ఒక్కరి ప్లాన్ ప్రత్యేకం 👤 – ఇతరుల ప్లాన్‌ను కాపీ చేయకండి. మీ బలాలు, అలవాట్లు దృష్టిలో పెట్టుకొని మీకే సరిపోయేలా ప్లాన్ చేసుకోండి.


🌟 సీక్రెట్ టిప్:
🎓 చదువులో “Consistency + Proper Plan = Success” ✅
🏆 క్రమం తప్పని పఠనంతో, సరైన పథకంతోనే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.


Was this article helpful?

Achieve Your Dream of Becoming an Officer with Enunciate Academy - India's Leading Coaching | Contact Us @ 9492444498